చిప్పిలి సమీపంలో చిరుత కలకలం

2చూసినవారు
చిప్పిలి సమీపంలో చిరుత కలకలం
మదనపల్లె-బెంగళూరు రోడ్డు చిప్పిలి సమీపంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మదనపల్లె అటవీశాఖ రేంజర్ ప్రసాదరావు ఆదేశాలతో సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అయితే, చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు, కనీసం కాళ్ల ముద్రలు కూడా లభించలేదని అధికారులు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు శనివారం సిబ్బందిని కాపలా ఉంచినట్లు రేంజర్ ప్రసాదరావు వెల్లడించారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్