మదనపల్లె: వడ్డీ వ్యాపారి వేధింపులు.. మహిళ ఆత్మహత్యాయత్నం

4155చూసినవారు
మదనపల్లె మండలం, కొండామారిపల్లి పంచాయతీ, ఇసుకనూతిపల్లికి చెందిన ప్రభావతి అనే మహిళ, వడ్డీ వ్యాపారి రవి వేధింపులు తాళలేక గురువారం రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన సోదరికి ఇచ్చిన అప్పును సోదరి తిరిగి చెల్లించకపోవడంతో, రవి పదేపదే మందలించాడని, దీంతో మనస్తాపం చెంది ఈ ఘోరానికి ఒడిగట్టిందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్