శుక్రవారం మదనపల్లిలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 6.30 లక్షల విలువైన 21 కిలోల గంజాయి, రూ. 2 లక్షల విలువైన రెండు మోటార్ సైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కనుభిల్లి ఈ వివరాలు తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన మదనపల్లి డీఎస్పీ మహేంద్రను ఎస్పీ అభినందించారు. అక్రమాలకు తావు లేకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని ఎస్పీ హెచ్చరించారు.