మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కురబలకోట సర్కార్ తోపునకు చెందిన సూరి (50) మృతి చెందాడు. మతిస్థిమితం సరిగా లేక స్వగ్రామం వదిలి మదనపల్లెలో నివాసం ఉంటున్న సూరి, రింగు రోడ్డులో ఎవరైనా ఇచ్చిన ఆహారం తింటూ జీవించేవాడు. ఆరోగ్యం బాగలేక ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించినట్లు అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు.