మదనపల్లె రోడ్డు ప్రమాదం: యువకుడికి తీవ్ర గాయాలు

3957చూసినవారు
మదనపల్లె మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తవారిపల్లె పంచాయతీ, రెడ్డివారిపల్లికి చెందిన 36 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సొంత పని ముగించుకుని స్వగ్రామానికి బైకులో వెళ్తుండగా, మార్గమధ్యంలోని రైల్వే గేటు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైకు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడిని వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్