కర్ణాటక రాష్ట్రం బల్తమర్రికి చెందిన శ్రావణి (25) తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ, మంగళవారం ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యుల సకాలంలో చికిత్సతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ఆసుపత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.