మదనపల్లి: భర్త అక్రమ సంబంధం వల్ల మహిళ ఆత్మహత్యాయత్నం

410చూసినవారు
మదనపల్లి: భర్త అక్రమ సంబంధం వల్ల మహిళ ఆత్మహత్యాయత్నం
ఆదివారం మదనపల్లిలో భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని మనస్థాపానికి గురైన ఓ మహిళ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బసినికొండకు చెందిన గణేష్ లారీలకు బాడీలు కట్టే పనిలో ఉన్నాడు. అతను భార్యాపిల్లలను పట్టించుకోకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్