మదనపల్లె: బొలెరో ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

3328చూసినవారు
మదనపల్లె: బొలెరో ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లె సమీపంలోని సుగాలి మిట్టలో రోడ్డు పక్కన బస్సు కోసం వేచి చూస్తున్న నిర్మలమ్మ (48) అనే మహిళను వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల చికిత్సతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు సమాచారం. పుంగనూరు మండలం బర్నేపల్లికి చెందిన నిర్మలమ్మ బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్లేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్