శివాజీ విగ్రహావిష్కరణలో మరాఠా అధ్యక్షుడు మంజునాథ్ పాల్గొని నివాళులర్పించారు

2982చూసినవారు
శివాజీ విగ్రహావిష్కరణలో మరాఠా అధ్యక్షుడు మంజునాథ్ పాల్గొని నివాళులర్పించారు
మదనపల్లె చిత్తూరు బస్టాండ్ సర్కిల్‌లో ఆదివారం ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామసముద్రం మండల మరాఠా అధ్యక్షుడు మంజునాథ్ పాల్గొని, శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్యసాహసాలు, పరిపాలనా దక్షత నేటి తరానికి ఆదర్శమని, సమాజ ఐక్యతకు ఆయన ఆశయాలను అనుసరించాలని మంజునాథ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మరాఠా సంఘం నాయకులు, సభ్యులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్