
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య-జ్యోతికల కూతురు
నటుల వారసులు సినీ రంగ ప్రవేశం సహజమే అయినా, వారు సాధించే గుర్తింపే ముఖ్యం. ఈ కోవలోకి వస్తున్న సూర్య-జ్యోతికల కూతురు దియా, హీరోయిన్గా కాకుండా దర్శకురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె రూపొందించిన తొలి షార్ట్ ఫిల్మ్ ‘లీడింగ్ లైట్’ 2D ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కింది. 13 నిమిషాల నిడివితో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లోని రెజెన్సీ థియేటర్లో ప్రదర్శితమవుతోంది. ఆస్కార్ క్వాలిఫయింగ్ రన్లో భాగంగా ప్రదర్శితమవుతుంది.




