లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

2832చూసినవారు
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు మొత్తం రూ. 4.50 లక్షల విలువైన సీఎం సహాయ నిధి (CMRF) చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక కూటమి నాయకుల సమక్షంలో చెక్కులను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందడంతో లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్