రామసముద్రంలో ఘనంగా మొహరం వేడుకలు

2652చూసినవారు
రామసముద్రంలో ఘనంగా మొహరం వేడుకలు
అన్నమయ్య జిల్లా రామసముద్రంలో ఆదివారం మొహరం వేడుకలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగాయి. ఎగువపేట, దిగువపేట, ఆర్. నడింపల్లికి చెందిన బాబాయిలను ఊరేగించి, పెట్రోల్ బంక్ సమీపంలోని మైదానంలో మిలాఖత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.

సంబంధిత పోస్ట్