మదనపల్లెలో వైయస్సార్సీపి మాజీ కౌన్సిలర్ గిరిజ సాయి శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని అన్నారు. దేశాయ్ అనేది కేవలం ఒక వ్యక్తి పేరు కాదని, ప్రజా సేవకు ప్రతీకగా నిలిచిన బ్రాండ్ అని పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చిన ప్రతి వార్తను నిజమని భావించి వ్యాఖ్యలు చేయడం బాధ్యతాయుతమైన రాజకీయ నాయకులకు తగదని, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు వ్యక్తిగత విమర్శలకు దిగడం దురదృష్టకరమని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో సరైన తీర్పు ఇస్తారని సాయి శేఖర్ రెడ్డి అన్నారు.