రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు

324చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
మదనపల్లె పట్టణంలోని చిత్తూరు బస్టాండ్ వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెంకటరెడ్డి (60) బస్టాండ్ వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా, మదనపల్లె - 2 డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఆయనపైకి దూసుకువచ్చింది. ఈ ఘటనలో వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్