తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దమండ్యం మండల కేంద్రంలోని శివాలయం వెళ్లే రహదారిలో తాగునీటి ఇనుప పైప్‌లైన్ తుప్పు పట్టి లీక్ అవుతోంది. దీంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. లీకేజీ కారణంగా నీరు వృథాగా పోతుండటంతో పాటు, రహదారిపై నీరు చేరుతున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీని పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.