అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేర రహిత సమాజాన్ని లక్ష్యంగా పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, గ్రామాల్లో అధికారులు ప్రజలను సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తం చేస్తున్నారు. తెలియని లింకులు, కాల్స్‌కు స్పందించవద్దని శనివారం సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల దుష్పరిణామాలను వివరించి, యువతను చదువు, క్రీడల వైపు మళ్లాలని కోరారు. మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణపై కూడా అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 100, సైబర్ మోసాలకు 1930, గంజాయి సమాచారం కోసం 1972 నంబర్లను వినియోగించాలని తెలిపారు.