సరస్వతీ పుత్ర పుట్టపర్తికి పోలీస్ శాఖ ఘన నివాళి

307చూసినవారు
సరస్వతీ పుత్ర పుట్టపర్తికి పోలీస్ శాఖ ఘన నివాళి
అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నారాయణాచార్యులు 14 భాషల్లో ప్రావీణ్యం సంపాదించి తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవలు అందించారని, ఆయన రచనలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఎస్పీ కొనియాడారు.

సంబంధిత పోస్ట్