కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు

1214చూసినవారు
కలెక్టరేట్‌లో ఘనంగా పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతి వేడుకలు
మదనపల్లె కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో శనివారం పుట్టపర్తి నారాయణాచార్యుల జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్ పరిపాలన అధికారి నాగభూషణం అధ్యక్షతన స్టెప్ అధికారులు, జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఆయన చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన విశిష్ట సేవలను, అనేక భాషల్లో పాండిత్యాన్ని, 'సరస్వతీ పుత్ర'గా ఆయనకున్న గుర్తింపును, ఆయన రచనలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్