రామసముద్రం మండలం తిరుమలపల్లికి చెందిన 12 ఏళ్ల మహమ్మద్ అనే బాలుడు గడ్డి కత్తిరించే యంత్రంలో చేయి పెట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో బాలుడి కుడి చేయి పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే బాలుడిని మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.