అన్నమయ్య జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు

4955చూసినవారు
అన్నమయ్య జిల్లాలో పెరుగుతున్న జ్వరాలు
అన్నమయ్య జిల్లాలో సీజనల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వందలాది మంది తరలివస్తున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకే ఆసుపత్రి వద్ద బారులుదీరారు. పట్టణంలో పారిశుద్ధ్యం లోపించడం, దోమలు పెరగడమే దీనికి కారణమని, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో చిన్నపిల్లలు, పెద్దలు బాధపడుతున్నారని తెలుస్తోంది. కాలువలు శుభ్రం చేసి దోమల నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్