ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించాలి – కలెక్టర్

427చూసినవారు
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందించాలి – కలెక్టర్
ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలు అందించడానికి, రానున్న జనగణనకు గ్రామ–వార్డు సచివాలయ సిబ్బంది పూర్తిగా సిద్ధంగా ఉండాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్షలో జనగణన, అక్షర ఆంధ్ర, దేవాలయ, రెవెన్యూ, ప్రభుత్వ ఆసుపత్రులు, అగ్నిమాపక శాఖ ఎన్ఓసీలు తదితర సేవలపై చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులకు తగిన సూచనలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్