అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం సబ్ జూనియర్, జూనియర్ బాలికల జిల్లా జట్ల ఎంపిక జరిగింది. రెండు విభాగాల్లో చెరో 25 మందిని జిల్లా క్యాంప్‌కు ఎంపిక చేశారు. ఈ నెల 27 నుంచి జడ్పీ హైస్కూల్‌లో శిక్షణ ప్రారంభం కానుంది. జూలై 2న నంద్యాలలో జరిగే రాష్ట్ర పోటీల్లో జూనియర్ జట్టు పాల్గొంటుంది. ముఖ్య అతిథి పులి నరేంద్ర కుమార్ రెడ్డి క్రీడాకారులకు క్రమశిక్షణతో సాధన చేసి విజయాలు సాధించాలని సూచించారు.