మదనపల్లెలో కురవంక మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి తనయుడు పసుపులేటి శశికుమార్ రాయల్ జన్మదినం సందర్భంగా మంగళవారం అమ్మచెరువు మిట్ట వెలుగు పాఠశాలలో వికలాంగులు, వృద్ధులకు పండ్ల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అక్క లక్ష్మీ ప్రసన్న, బావ శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, స్నేహితులు, కుటుంబ సభ్యులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.