శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి బ్రహ్మ రథోత్సవాలు: పాండురంగ అవతారంలో స్వామి దర్శనం

1349చూసినవారు
శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి బ్రహ్మ రథోత్సవాలు: పాండురంగ అవతారంలో స్వామి దర్శనం
రామసముద్రం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ జనార్ధన స్వామి బ్రహ్మ రథోత్సవాలు జరుగుతున్నాయి. బుధవారం స్వామివారు శ్రీ పాండురంగ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు పార్థసారథి బట్టర్, కులశేఖర్ బట్టర్ ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతాభిషేకాలు, కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి భక్తిశ్రద్ధలతో పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

సంబంధిత పోస్ట్