సూర్య ఘర్ పథక లక్ష్యాలు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్

479చూసినవారు
సూర్య ఘర్ పథక లక్ష్యాలు పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో కేటగిరీల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల పనులను వేగవంతం చేయాలని సూచించారు. మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో విద్యుత్, ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్ తదితర శాఖల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. జలజీవన్ మిషన్, అమృత్ 2.0 తదితర పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్