మదనపల్లికి చెందిన టైలర్ మహేష్ మృతి

935చూసినవారు
మదనపల్లికి చెందిన టైలర్ మహేష్ మృతి
మదనపల్లికి చెందిన 40 ఏళ్ల టైలర్ మహేష్ అనారోగ్యంతో మృతి చెందినట్లు ఆస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు. స్థానికంగా నివాసం ఉంటున్న మహేష్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆరోగ్యం క్షీణించడంతో రెండు రోజుల క్రితం మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరారు. వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తుండగా, గురువారం వేకువజామున ఆయన మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్