మదనపల్లె పట్టణంలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు స్టోర్ రాజు, రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని స్టోర్ రాజు మంత్రిని కోరగా, మంత్రి సానుకూల హామీ ఇచ్చినట్లు తెలిసింది.