నీళ్లు అనుకుని టిన్నర్ తాగిన చిన్నారి

265చూసినవారు
నీళ్లు అనుకుని టిన్నర్ తాగిన చిన్నారి
కురబలకోట మండలం అంగళ్లులో గురువారం లక్ష్మి అనే మహిళ కుమార్తె లిఖిత ప్రియ (2) ఇంట్లో ఆడుకుంటూ పెయింట్ కొట్టడానికి తెచ్చిన టిన్నర్‌ను నీళ్లు అనుకుని తాగేసి అస్వస్థతకు గురైంది. గమనించిన కుటుంబీకులు వెంటనే చిన్నారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్