మదనపల్లె మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గురువారం మార్కెట్‌కు 37 మెట్రిక్ టన్నుల టమోటాలు రాగా, వ్యాపారులు మొదటి రకాన్ని 10 కిలోలకు రూ. 150, రెండో రకాన్ని రూ. 140, మూడో రకాన్ని రూ. 130 చొప్పున కొనుగోలు చేశారు. గత ధరలతో పోలిస్తే ప్రస్తుతం ధరలు గణనీయంగా పడిపోవడంతో పెట్టుబడులు కూడా రాక రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో టమోటా సాగు చేసిన రైతుల భవితవ్యంపై ఆందోళన నెలకొంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు.