అన్నమయ్య జిల్లా, మదనపల్లెలోని ముదివేడు గ్రామంలో రాజమ్మ అనే దళిత మహిళపై అగ్రవర్ణాల వారు దాడి చేశారు. ఇంటి ముందు నడవకూడదని, నడిస్తే మైల అవుతుందని కించపరిచేలా మాట్లాడారు. ప్రశ్నించిన రాజమ్మ ఇంట్లోకి దూరి అఫ్జల్, సాహిన, మధుసూదన్ రెడ్డి, నజియా దాడి చేశారు. గాయపడిన రాజమ్మను స్థానికులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. దళిత మహిళలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని అంబేద్కర్ సేన నాయకులు ముత్యాల మోహన్ తెలిపారు.