మదనపల్లి పట్టణంలోని రెడ్డిస్ కాలనీకి చెందిన సుల్తానా (33) శనివారం కదిరి రోడ్డులోని సంఘం ఫంక్షన్ హాల్ వద్ద రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు.