టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు

90చూసినవారు
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో 70 మందికి ఎక్స్‌రే పరీక్షలు
మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని వెలుగు సంస్థలో శుక్రవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది. బొమ్మనచెరువు వైద్య బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో 70 మంది వృద్ధులు, సిబ్బందికి ఛాతీ ఎక్స్‌రేలు తీసి టీబీ నిర్ధారణ పరీక్షలు చేశారు. టీబీ వ్యాధిపై అవగాహన కల్పించి, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు. వెలుగు సంస్థ సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్