అప్పుల బాధతో శనివారం పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మదనపల్లి మండలం మాలెపాడు గ్రామానికి చెందిన యువ రైతు వెంకటేష్ (38) ఆదివారం తెల్లవారుజామున ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వ్యవసాయ బోర్లలో నీళ్లు అడుగంటి పంటలు ఎండిపోవడంతో, రూ. 20 లక్షలకు పైగా ఉన్న అప్పులు ఎలా తీర్చాలో దిక్కుతోచక ఆయన ఈ ఘాతుకానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.