జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: 76 ఆర్టీసీ బస్సుల కేటాయింపు

3చూసినవారు
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు: 76 ఆర్టీసీ బస్సుల కేటాయింపు
ఈ నెల 5వ తేదీన జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ విధుల కోసం ఓటర్ల తరలింపు నిమిత్తం మదనపల్లి ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 76 బస్సులను ఎన్నికల విధులకు కేటాయించినట్లు డిపో మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇందులో మొదటి డిపో నుంచి 38, రెండో డిపో నుంచి 38 బస్సులను పంపనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో, 5వ తేదీన బస్సు సేవలు అందుబాటులో ఉండవని, ప్రయాణికులు గమనించాలని సూచించారు. తిరిగి 6వ తేదీ నుంచి బస్సు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్