
కడప రిమ్స్‌లో కానాల సేవా ట్రస్ట్ సేవలు: రక్తదానంతో ప్రాణాలు కాపాడిన కృష్ణారెడ్డి
కడప రిమ్స్ హాస్పిటల్లో రామ లక్ష్మమ్మ అనే రోగికి ప్రసవ సమయంలో అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరమైంది. కుటుంబ సభ్యులు కానాల సేవా ట్రస్ట్‌ను సంప్రదించగా, వెంటనే స్పందించి కృష్ణారెడ్డి అనే వ్యక్తి రక్తదానం చేశారు. ఈ సేవకు రోగి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సకాలంలో స్పందించి, సేవా దృక్పథంతో రక్తదానం చేసిన కృష్ణారెడ్డి, కానాల సేవా ట్రస్ట్‌ను అందరూ అభినందిస్తున్నారు.








































