మైదుకూరు ప్రధాన తపాలా కార్యాలయంలో బుధవారం నాడు ఆధార్ సేవలు ప్రారంభమయ్యాయి. ప్రొద్దుటూరు పోస్టల్ అధికారి జీ కిరణ్, మైదుకూరు పోస్ట్మాస్టర్ ఎస్ షౌకత్ అలీ ఈ విషయాన్ని తెలిపారు. కొత్త ఆధార్ నమోదు, బయోమెట్రిక్ అప్డేట్, మొబైల్ నెంబర్ లింక్, చిరునామా మార్పు వంటి సేవలు పని దినాలలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.