వైఎస్సార్ కడప జిల్లాలోని చాపాడు మండలం ఖాదర్ పల్లి గ్రామంలో గురువారం ఉదయం జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమలనాథ శర్మ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం జరిగింది. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వం పాఠశాలలకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ, పిల్లలకు విలువలతో కూడిన విద్యను అందిస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇస్మాయిల్, రామలక్ష్మమ్మ, జమీల్, ఆయేషా, యాస్మిన్, విద్యార్థులు పాల్గొన్నారు.