వనిపెంట బీసీ బాలికల గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

997చూసినవారు
వనిపెంట బీసీ బాలికల గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశాలకు, 6, 7, 8 తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. నిర్మల తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఫిబ్రవరి 4 నుంచి మార్చి 4 వరకు mjpapbcwreis.apcfss.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు పాఠశాలను సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్