మైదుకూరులో ట్రాన్స్ఫార్మర్ కరెంటుకు దూడ మృతి

765చూసినవారు
మైదుకూరులో ట్రాన్స్ఫార్మర్ కరెంటుకు దూడ మృతి
మైదుకూరు పట్టణంలో గురువారం గడ్డి వేయడానికి వెళ్లిన జేట్టి చిన్న నర్సింహులుకు చెందిన దూడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కరెంటు తగిలి మృతి చెందింది. ప్రమాదకరమైన స్థాయిలో (అతి తక్కువ ఎత్తులో) ఉన్న ట్రాన్స్ఫార్మర్ వల్లే ఈ దుర్ఘటన జరిగిందని దూడ యజమాని తెలిపారు. ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్ ను వెంటనే తొలగించి, తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్