ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా మైదుకూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపాల్ డాక్టర్ పి. నారాయణ రెడ్డి అధ్యక్షత వహించి, ఆరోగ్యకరమైన జీవనశైలితో క్యాన్సర్‌ను నివారించవచ్చని తెలిపారు. ముఖ్య అతిథి డాక్టర్ నరసింహారావు క్యాన్సర్ లక్షణాలు, చికిత్స గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రామేశ్వర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.