ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బ్రహ్మంగారిమఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది బుధవారం ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ, 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి వారి ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ పుష్పరాజ్, హెల్త్ అసిస్టెంట్ మాధవ నాయుడు, వెంకటరెడ్డి, ఎంపీహెచ్ఏ వీర జోత్స్న, విజయలక్ష్మి పాల్గొన్నారు.