మైదుకూరు అర్బన్ సీఐ కె. రమణా రెడ్డి, బంగారం, వెండి ధరలు పెరిగిన నేపథ్యంలో షాపుల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గురువారం సాయంత్రం యజమానులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, షాపుల్లో సీసీ కెమెరాలు కచ్చితంగా పనిచేసేలా చూసుకోవాలని, కుదువ పెట్టిన వస్తువులను యజమానులకు తెలియకుండా కరిగించరాదని, తగు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటరమణ పాల్గొన్నారు.