నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు

758చూసినవారు
నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు
కడప జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధి కల్పన - వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ (సీడప్) కడప ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠం ప్రాంత నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు సీడఫ్ జెసివో ఆంజనేయులు గురువారం తెలిపారు. 10వ తరగతి పాసై, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా చేసి ఖాళీగా ఉన్న 18-30 ఏళ్ల వారికి 90 రోజుల పాటు హాస్టల్ వసతితో శిక్షణ అందించి, ఎన్ఎస్డీసీ సర్టిఫికెట్ ఇస్తామని, వివరాలకు 7731013622 నంబరును సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్