విద్యార్థినులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ

588చూసినవారు
విద్యార్థినులకు ఉచిత కళ్లద్దాలు పంపిణీ
మైదుకూరు మండల కేంద్రమైన చాపాడులో గురువారం నాడు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమంలో భాగంగా కస్తూర్బా గాంధీ ఉన్నత పాఠశాల విద్యార్థినులకు టిడిపి మండల అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు శివ ప్రసాద్ రెడ్డి కలిసి ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేశారు. ప్రతి పాఠశాలలో ప్రభుత్వ వైద్యులతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన విద్యార్థులకు కళ్లద్దాలు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మైనార్టీ కార్యదర్శి అక్బర్ సలీం, బైపీరెడ్డి, కిరణ్, మస్తాన్, రవి, పాఠశాల సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్