మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఆయన తనయుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఢిల్లీలోని యునెస్కో కార్యాలయంలో అధికారి ఆనంద్ కాంత్ ను కలిసి బ్రహ్మంగారిమఠానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని యునెస్కో అధికారి హామీ ఇచ్చారు. ఈ చర్య బ్రహ్మంగారిమఠం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పే దిశగా ఒక ముందడుగు.