కడప జిల్లా లోని ప్రముఖ ఆలయాలలో హైకోర్టు న్యాయమూర్తుల పూజలు

8చూసినవారు
కడప జిల్లా లోని ప్రముఖ ఆలయాలలో హైకోర్టు న్యాయమూర్తుల పూజలు
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ తార్లాడ రాజశేఖర్‌రావు , జస్టిస్‌ బాలాజీ మెడమల్లి, కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ గోపాల్‌ లు దేవుని కడపలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారిని, నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఆలయ నిర్వాహకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్