పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో హుండీ లెక్కింపు

910చూసినవారు
పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో హుండీ లెక్కింపు
బ్రహ్మంగారిమఠం మండలంలోని జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి వారి మఠంలో 65 రోజుల హుండీ లెక్కింపు జరిగింది. మఠాధిపతులు శ్రీ వీరధర్మజ వెంకటాద్రి స్వామి వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం రూ.30,94,989 నగదు, 7 గ్రాముల బంగారం, 221 గ్రాముల వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరయ్య చారి బుధవారం తెలిపారు. కడప జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర బాలాజీ ఈ లెక్కింపునకు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్