మహిళల గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు వార్తలు ప్రచురించిన ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మైదుకూరు సీఐ రమణారెడ్డికి ఆయన ఫిర్యాదు చేశారు. నీచమైన జర్నలిజంపై చంద్రబాబు ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో పలువురు
వైసీపీ నాయకులు పాల్గొన్నారు.