శుక్రవారం మైదుకూరు డివిజన్ ఆఫీసు వద్ద యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నిరసన తెలిపింది. ఎనర్జీ అసిస్టెంట్ల రివర్షన్ కు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులపై యాజమాన్యం ఇంప్లీడ్ అయ్యి న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. జిల్లా అధ్యక్షులు నాగసుబ్బయ్య మాట్లాడుతూ, జేఎల్ఎంలుగా వారిని కొనసాగించాలని, పెండింగ్ డీఏ విడుదల చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం తప్పదని హెచ్చరించారు.