బీసీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు బీసీ రమణ ఆధ్వర్యంలో, వైఎస్సార్ కడప జిల్లా నుండి బీసీ సోదరులు, మహిళలు వేలాదిగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీల న్యాయమైన హక్కుల కోసం ధర్నాలో పాల్గొన్నారు. కడప జిల్లా బీసీ అధ్యక్షులు రాజా, మల్లె బాలకృష్ణ, బోలా లా శ్రీనివాసులు, రాళ్లపాటి చిన్న మస్తాన్, ఆది బోయిన గురవయ్య, వనిపెంట సుబ్బరాయుడు తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. బీసీల డిమాండ్లను పరిష్కరించాలని ఈ ధర్నాలో కోరారు.